Alukalu Chelavu


Audio link :GBKP Archive link : ప|| అలుకలు చెల్లవు హరి పురుషోత్తమ | నలి నిందిర నీతో నవ్వినది || చ|| ఆదిలక్ష్మి మోహన కమలంబున | వేద మాత నిన్ను వేసినది | ఆదెస నీపై నభయహస్తమును | సాదరముగ గడు జూచినది || చ|| సిరి దన కన్నుల చింతామణులను | పొరి నీపై దిగ బోసినది | వరద హస్తమున వలచెయి పట్టుక | అరుదుగ నిను మాటాడించినది || చ|| జలధి కన్య తన సర్వాంగంబుల | బిలిచి నిన్ను నిటు పెనగినది | అలముక శ్రీ వేంకటాధిప నిను రతి- | నెలమి నీ వురంబెక్కినది || in english: pa|| alukalu cellavu hari puruShOttama | nali niMdira nItO navvinadi || ca|| AdilakShmi mOhana kamalaMbuna | vEda mAta ninnu vEsinadi | Adesa nIpai naBayahastamunu | sAdaramuga gaDu jUcinadi || ca|| siri dana kannula ciMtAmaNulanu | pori nIpai diga bOsinadi | varada hastamuna valaceyi paTTuka | aruduga ninu mATADiMcinadi || ca|| jaladhi kanya tana sarvAMgaMbula | bilici ninnu niTu penaginadi | alamuka SrI vEMkaTAdhipa ninu rati- | nelami nI vuraMbekkinadi ||

Chapters

Aukalu chelavu 5:23